చేనేతకారుల బలోపేత లక్ష్యంగా జనసేన పార్టీ అడుగులు

చేనేత

   ఎమ్మిగనూరు, (జనస్వరం) :   ఇటీవలే జనసేన పార్టీ ప్రకటించిన చేనేత వికాస్ రాష్ట్ర కమిటీలో ఎమ్మిగనూరు నియోజకవర్గం తరఫున రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కాసా.రవి ప్రకాష్ గారిని జనసేన పార్టీ కార్యాలయం నందు మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత వికాస్ కార్యదర్శి కాసా.రవి ప్రకాష్ గారు మాట్లాడుతూ తనను నమ్మి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం పట్ల జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్  గారికి,  నియోజకవర్గ ఇంఛార్జ్ రేఖా గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా తనకి ఇచ్చిన ఈ బాధ్యతని చేనేత కార్మికుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని, చేనేత కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తానని తెలిపారు. అనంతరం జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, జనసేన వెంకట్, రషీద్ గార్లు  మాట్లాడుతూ ఇంత వరకు ఏ ప్రభుత్వాన్ని చూసినా చేనేత కార్మికులను కేవలం ఓట్ బ్యాంక్ కొరకే వాడుకున్నారని, చేనేతలకు గుర్తింపు ఇచ్చిన ఏకైక పార్టీ జనసేన అని వారు గుర్తు చేశారు.  ఈ కార్యక్రమంలో, తిమ్మప్ప, వాసు, రమేష్, వీరేష్, చిన్న, తదితరులు పాల్గొన్నారు.

See also  జనసైనికుడి కుటుంబానికి అండగా నిలిచిన ఆమదాలవలస జనసేన నాయకులు