రోడ్డు అక్రమ దౌర్జన్యాల గురించి ప్రశ్నించిన జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇంఛార్జ్ అక్కల రామమోహనారావు (గాంధీ)

రోడ్డు అక్రమ

       కొండపల్లి మున్సిపాలిటీ,  ఇబ్రహీంపట్నంలో కృష్ణ గోదావరి సంఘం రోడ్డులో కబ్జాదారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. గట్టును తవ్వి ఇల్లు కట్టుకుంటున్నా కబ్జాదారులు ఆ ఇల్లు కడుతున్న స్థలం క్రింద మంచినీళ్లు పైప్ లైన్ వుంది. రేపు పైప్ లైన్ లీకేజ్ అయితే కట్టిన ఇల్లు నేలమట్టం జరుగుతుంది.  ఆ ఇంట్లో వున్నా వ్యక్తులకు ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది, అధికారులుదా? ప్రభుత్వాన్నిదా అని ఆయన ప్రశ్నించారు. కొండపల్లి మున్సిపాలిటీ అధికారులు దీనిమీద చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ  ఇంఛార్జ్ అక్కల రామమోహనారావు (గాంధీ) గారు మరియు బొలియా శెట్టి శ్రీకాంత్  గారు అధికారులకు విజ్ఞప్తి చెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమములో జనసేన నాయకులు మరియు జనసైనికులు మరియు తదితురులు పాల్గొన్నారు.

See also  పాలకొండలో టిడిపి రిలే దీక్షకు జనసేన నాయకుల మద్దతు