
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతకారులను సన్మానించిన జనసైనికులు
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని షేర్ మొహమ్మద్ పేట గ్రామంలో ఉన్నటువంటి చేనేత వస్త్రకారులని నియోజకవర్గ నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ తరుపున సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవం ఆగష్టు 7న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు అని భారత స్వాతంత్ర్యోద్యమములో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్య్ర సమపార్జనకు ఒక సాధనంగా నిలిచింది. చేనేత అని గాంధీజీ కూడా రాట్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు అని అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేతరంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశ్యంతో జాతీయ చేనేత దినోత్సవంను ఏర్పాటుచేయడం జరిగింది అని ఆయన తెలిపారు. 2015, ఆగస్టు 7న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించి, భారత చేనేత లోగోను ఆవిష్కరించడంతోపాటూ ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించారు అని ఈ సందర్భంగా 2012-14 సంవత్సరాల్లో చేనేత రంగంలో ప్రతిభ కనబరిచిన 72 మందికి అవార్డులు (వీరిలో 16 మందికి సంత్ కబీర్ పురస్కారాలు) ప్రదానం జరిగింది అని భారత స్వాతంత్ర్యోద్యమములో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్య్ర సమపార్జనకు ఒక సాధనంగా నిలిచింది, అని భారత స్వాతంత్రోద్యమంలో చేనేత అహింసాయుత ఉద్యమానికి నాంది పలికిన చేనేతరంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన యర్రమాద వెంకన్న నేత చేనేత దినోత్సవానికి సరైన తేదీ కోసం అధ్యయనం చేశాడు అని భారత స్వాతంత్య్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో విదేశీ వస్త్రాలను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం వచ్చింది అని మొదటిసారిగా 1905లో బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తాలోని టౌన్‌హాల్‌లో 1905 ఆగస్టు 7న భారీ సమావేశం నిర్వహించి విదేశీ వస్త్రాలను బహిష్కరించడంతోపాటూ దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు అని అలా విదేశి వస్తు బహిష్కరణలో కీలకపాత్ర వహించిన ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా చేయాలని పిలుపునిచ్చారని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో చేనేత కార్మికుల గురించి పోరాటాలు కార్యక్రమాలు చేసారని జనసేన పార్టీ ఎల్లపుడు చేనేత కార్మికుల గురించి ఆలోచించే పార్టీ అని ఈ సందర్భంగా ఆయన తెలియచేసారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా, చేనేత కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, అంతరించిపోతున్న చేనేత కలను పరిష్కరించాలని జనసేన పార్టీ తరుపున కోరుచున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగ, పాషా, బాజి, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.









