చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు గారితల్లి సుశీలమ్మ ప్రధమ వర్థంతి సందర్భంగా సీలింగ్ ఫ్యాన్స్ వితరణ చేసిన జనసైనికులు

చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు రాజ్ కుమార్  గారితల్లి సుశీలమ్మ ప్రధమ వర్థంతి సందర్భంగా సీలింగ్ ఫ్యాన్స్ వితరణ చేసిన జనసైనికులు

    చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు A.రాజ్ కుమార్  గారితల్లి సుశీలమ్మ ప్రధమ వర్థంతి సందర్భంగా నెల్లూరు నగరం లోని గీతమయి వృద్ధ ఆశ్రమ౦ వారికి 10 సీలింగ్ ఫ్యాన్లులు ఇవ్వడం జరిగింది. కరోనా లాక్ డౌన్ వల్ల రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు బదులుగా చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు చేతుల మీద ఆశ్రమ నిర్వహుకులు పాండుకి  సీలింగ్ ఫ్యాన్స్ అందజేశారు. కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సుశీలమ్మ గారు మంచి సేవా భావాలు గల పిల్లలని జన్మనిచ్చారని అన్నారు. ఈ వృద్ధ ఆశ్రమము లో పెద్దల ఆశీస్సులు ఉండాలని, సుశీలమ్మ ఆత్మ శాంతి కలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొట్టే వెంకటేశ్వర్లు,  p. హరిక్రిష్ణ, మురళి, ఉదయ్ ఆశ్రమ నిర్వహకుడు పాండు తదితరులు పాల్గొన్నారు. 

See also  అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన కుటుంబానికి అండగా జనసేన నాయకులు