విశాఖ అంటే పరిశ్రమలకు పెట్టింది పేరు. విశాఖ HPCL లో జరిగిన అగ్నిప్రమాదం మన అందరికీ తెలిసిందే. ఒక ఏడాది కాలంలోనే అనేక భయంకరమైన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. LG పోలిమర్స్ కానీయండి, పరావాడ సెజ్ కానీయండి, ఈరోజు HPCL. ప్రతి కంపెనీలో సేఫ్టీ ఆడిట్స్ పెట్టాలి అని జనసేన పార్టీ పలుమార్లు విన్నవించుకున్నా సరే పాటించే పరిస్థితి లేదు. దీని మూలంగా రోజు ఏదోక ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని విశాఖ పశ్చిమ జనసేన నాయకులు ధర్మేంధ్ర గారు ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి అప్పట్లోనే జనసేన పార్టీ తరుపున సేఫ్టీ ఆడిట్ జరిపించాలని కోరామని, అలా ప్రభుత్వం సేఫ్టీ ఆడిట్ ను విశాఖలో ఉన్న పరిశ్రమల్లో జరిపించి ఉంటే ఈ స్థితి వచ్చేది కాదని అన్నారు. ప్రమాదం జరగ్గానే బాధితులకు కొంత మేర డబ్బులు పరిహారం అందించి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. అలాగే జరిగిన ప్రమాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ జనసేన పార్టీ తరపున HPCL మేనేజ్మెంట్ కి మా డిమాండ్స్ తెలియజేయడం జరిగిందని అన్నారు. తక్షణమే HPCL లో సేఫ్టీ ఆడిట్ జరిపించి, ప్లాంట్ విస్తరణకు వెళ్తున్న యాజమాన్యం గ్రీన్ బెల్ట్ ఎంత ఉందో ఇండస్ట్రియల్ బెల్ట్ ప్రజలకు తెలియజేయాలన్నారు. గతంలో ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఇస్తామన్న పరిహారం కూడా ఇంతవరకూ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్ల విశాఖ ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకపోతున్నారని, ఇక్కడి ప్రజలకు స్వచ్చమైన వాతావరణం కల్పించలేకపోయారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని వీడి పర్యావరణ రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం పరిశ్రమల సేఫ్టీ ఆడిట్ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేనిచో జనసేన పార్టీ తరుపున పోరాటానికి సిద్దంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంజునాథ్, శ్రీకాంత్, మనోహర్, గౌతమ్, సంతోష్, నగేష్, ప్రభు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
హిందూపురం నియోజకవర్గం, కొండూరు గ్రామంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసైనికులు
అంబులెన్స్ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్
కర్నాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు, సహకరించిన జనసైనికులు
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here