జనసైనికుడికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మిగనూరు జనసేన నాయకులు

జనసైనికుడి

          జనసేన పార్టీ ఇటీవలే కరోనా మహమ్మారి బారిన పడి మరణించిన ఎమ్మిగనూరు నియోజకవర్గం జన సైనికుడు శ్రీ గొల్ల ఉపేంద్ర యాదవ్ గారికి పార్టీ కార్యాలయం నందు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతం కోసం ఎల్లవేళలా కృషి చేసిన జన సైనికుడు అకాల మరణం మమ్మల్ని ఎంతగానో కలచి వేసిందని జన సైనికుడు ఉపేంద్ర యాదవ్ గారి మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. జన సైనికుడు శ్రీ ఉపేంద్ర యాదవ్ గారి కుటుంబానికి జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి రేఖ గౌడ్ గారి సహకారంతో ఎల్లవేళలా జన సైనికుడు కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రవి ప్రకాష్, షబ్బీర్, సోమశేఖర్ వెంకటేష్ రషీద్ మళ్లీ తదితరులు పాల్గొన్నారు. 

See also  నరవరెల్లి కాలనీలో ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని జనసేన నాయకులు నిరసన

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి