అధికారుల బదిలీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దురంహంకారానికి నిదర్శనం : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

             నెల్లూరు జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఐ వేమారెడ్డి ల బదిలీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దురంహంకారానికి నిదర్శనం జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారు ధ్వజమెత్తారు. ఇసుక దోపిడీని అడ్డుకోవడం వారు చేసిన పాపమా అని అన్నారు.  రాష్ట్రంలో రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా ఉన్న జిల్లా నెల్లూరు జిల్లా అని అన్నారు. అది గుర్తించే అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలని భావించిన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రెడ్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. కానీ, ఇప్పుడు నిజాయితీగా ఏ రెడ్డి అధికారి ఈ జిల్లాలో పని చేస్తున్నా వారిపై తీవ్రంగా వేధింపులు జరుగుతున్నాయి అని అన్నారు. మంత్రి అనిల్ కు జిల్లా మొత్తాన్ని ఇష్టప్రకారం దోచుకోమని, ఆ దోపిడీలకు అడ్డొచ్చిన అధికారులను బదిలీ చేయమని సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారా అని ఫైర్ అయ్యారు. ఈ అంశం పై ప్రభుత్వం వెంటనే విచారణ జరపాని కోరారు. 

See also  రైల్వే కోడూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి