రాజంపేటలో కోవిడ్ కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని జనసేన నాయకులు రామశ్రీనివాసులు డిమాండ్

         రాజంపేట పట్టణంలో కోవిడ్ కేంద్రాలను అందుబాటులో ఉంచడం ప్రజలకు అత్యంత అవసరం నెలకొందని జనసేన నాయకులు రామశ్రీనివాసులు అన్నారు. కోవిడ్ బారిన పడిన రోగులకు వైద్య ఆరోగ్య కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని జనసేనపార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. రోగికి మనో ధైర్యం కలిగించాల్సిన వైద్యులు ఏ వైద్యం కోసం హాస్పిటల్ కు పోయిన మొదట కోవిడ్ పరీక్ష చేయించుకుని రమ్మని చెప్పుతుండంతో చేసేది ఏమిలేక వెనుదిరిగి పోతున్నారు. అసలు కరోనాతో ఎవ్వరు భయపడడం లేదు వైద్యులే ప్రజలను, రోగులను భయపెడుతున్నారు. గతంలో జ్వరం, దగ్గు, జలుబు మొదలైనవి వచ్చేవి. కానీ, ఇప్పుడు ఇలాంటివి ఏమి వచ్చిన వైద్యులు సాధారణమైన వైద్యం అందించకుండ లేనిపోని భయందోళనకు గురించేస్తున్నారు. ప్రజలు సాధారణ వ్యాధులు వస్తే ఏమి చేయాలో తెలియక ఒత్తిడికి గురై ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా వైద్యులు ప్రజలకు ఎలాంటి జబ్బులు వచ్చిన వైద్యం అందించేలా చూస్తే ప్రజలకు ఒక భరోసా కలిపిస్తే వ్యాధిగ్రస్థులకు ఒక మానో ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులో వైద్యుల తీరుతో ప్రజలు, వ్యాధిగ్రస్థులు దేవుడి మీద భారం వేసి బ్రతుకుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో కరోనాతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్య కేంద్రాల చుట్టూ తిరుగుతూ కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిలో రాజంపేట అసెంబ్లీ మరియు పార్లమెంట్ జిల్లా రాష్ట్ర వైసీపీ నేతలు బాధ్యతలు మరిచి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం అలానే ప్రజాప్రతినిధులము అనే బాధ్యత కూడా పక్కన పెట్టి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఈ సమయంలో కూడా వైసీపీ నేతలు వారి యొక్క వ్యక్తిగత సరసాలకు ముఖ్య ప్రాధాన్యం ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా పాలకులు తేరుకొని రాజంపేటలో కోవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. 

See also  క్రియాశీలక సభ్యత్వ కిట్లును పంపిణీ చేసిన హిందూపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ ఆకుల ఉమేష్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి