యువత ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని కోరిన జనసేన నాయకులు

                    కరోనా బారిన పడి కోలుకున్న ప్రతిఒక్కరూ ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని గూడూరు నియోజకవర్గచిరంజీవి యువత మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు తీగల చంద్రశేఖర్ గారు కోరారు. తిరుపతిలో కరోనాతో ఇబ్బంది పడుతున్న వ్యక్తికి ప్లాస్మా అవసరం కావడంతో అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు స్వామినాయుడు పిలుపుమేరకు SVS చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ లో గూడూరు మెగా అభిమాని, జనసైనికుడు శుక్రవారం ప్లాస్మా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు రక్తదానం చేసి తలసిమియా బాధితులు, క్షతగాత్రులను ఆదుకోవాలని కోరారు. కరోనా వచ్చి తగ్గిన వారు నెల రోజుల తర్వాత ఇచ్చే ప్లాస్మా వల్ల కరోనా బారిన పడ్డ వారి ప్రాణాలను కాపడవచ్చని, యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు పగడాల మురళి, వైద్యులు LR నాయుడు,  జనసైనికులు, మెగా అభిమానులు కోటి, సాయి తదితరులు పాల్గొన్నారు. 

See also  ఇంద్రజిత్ ఆధ్వర్యంలో ఘనంగా అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి