Search
Close this search box.
Search
Close this search box.

సమస్యపై పొరాడి విజయం సాధించిన విజయనగరం జనసేన నాయకులు, వీర మహిళలు

                విజయనగరం, 42వ డివిజన్ కామాక్షి నగర్ లో జన నివాసాల మధ్య సుప్రియ బార్ & రెస్టారెంట్ ను పెట్టడాన్ని ముందునుంచి జనసేన పార్టీ వ్యతిరికిస్తూ వస్తుంది. అలాగే ఎన్నోసార్లు ఉద్యమం కూడా చేసింది. అందులో భాగంగానే స్థానిక ప్రజల సంతకాలు సేకరించి.. జిల్లా సూపరెండేంట్ ఆఫ్ పోలీసు వారికి, జిల్లా మద్యపాన నియంత్రణ శాఖకు పిర్యాదు చేయడం జరిగింది. పిర్యాదు అందుకున్న వెంటనే మధ్యవర్తిత్వం ద్వారా ఓసారి కూర్చొని మాట్లాడుకుందామని రాయ బా(బే)రాలు పంపినా.. బార్ ను తొలగించడంకోసం చేస్తున్న ఉద్యమాన్ని జనసేన ఆపలేదు. ( రాత్రి 12 దాటాక ఎన్నో సార్లు బార్ వద్ద గొడవలు జరిగినప్పుడు 100 కి ఫోన్ చేసిన రోజులున్నాయి.) ఆ తరువాత జిల్లా సూపరెండేంట్ ఆఫ్ పోలీసు వారు ఈ కేసును వన్ టౌన్ పోలీసు వారికి అప్పగించారు. వన్ టౌన్ పొలీస్ వారు రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ వారికి కూడా జనసేన నాయకుల, వీరమహిళల సంతకాలను పంపించడం జరిగింది. ఎట్టకేలకు కామక్షి నగర్ లో ఈ మధ్యనే బార్ ను తొలగించడం జరిగింది. దీనికి సహకరించిన స్థానిక ప్రజానీకానికి, మా జనసైనికులకు, ఝాన్సీ వీరమహిళలకు, ముఖ్యంగా పోలీసు శాఖ వారికి మరియు ప్రజలకు తెలియజేసిన ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు జనసేన నాయకులు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ప్రజలపక్షాన నిత్యం పోరాడతామని స్థానిక జనసేన నాయకులు త్యాడ రామకృష్ణ గారు హామీ ఇచ్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way