విజయనగరం, 42వ డివిజన్ కామాక్షి నగర్ లో జన నివాసాల మధ్య సుప్రియ బార్ & రెస్టారెంట్ ను పెట్టడాన్ని ముందునుంచి జనసేన పార్టీ వ్యతిరికిస్తూ వస్తుంది. అలాగే ఎన్నోసార్లు ఉద్యమం కూడా చేసింది. అందులో భాగంగానే స్థానిక ప్రజల సంతకాలు సేకరించి.. జిల్లా సూపరెండేంట్ ఆఫ్ పోలీసు వారికి, జిల్లా మద్యపాన నియంత్రణ శాఖకు పిర్యాదు చేయడం జరిగింది. పిర్యాదు అందుకున్న వెంటనే మధ్యవర్తిత్వం ద్వారా ఓసారి కూర్చొని మాట్లాడుకుందామని రాయ బా(బే)రాలు పంపినా.. బార్ ను తొలగించడంకోసం చేస్తున్న ఉద్యమాన్ని జనసేన ఆపలేదు. ( రాత్రి 12 దాటాక ఎన్నో సార్లు బార్ వద్ద గొడవలు జరిగినప్పుడు 100 కి ఫోన్ చేసిన రోజులున్నాయి.) ఆ తరువాత జిల్లా సూపరెండేంట్ ఆఫ్ పోలీసు వారు ఈ కేసును వన్ టౌన్ పోలీసు వారికి అప్పగించారు. వన్ టౌన్ పొలీస్ వారు రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ వారికి కూడా జనసేన నాయకుల, వీరమహిళల సంతకాలను పంపించడం జరిగింది. ఎట్టకేలకు కామక్షి నగర్ లో ఈ మధ్యనే బార్ ను తొలగించడం జరిగింది. దీనికి సహకరించిన స్థానిక ప్రజానీకానికి, మా జనసైనికులకు, ఝాన్సీ వీరమహిళలకు, ముఖ్యంగా పోలీసు శాఖ వారికి మరియు ప్రజలకు తెలియజేసిన ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు జనసేన నాయకులు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ప్రజలపక్షాన నిత్యం పోరాడతామని స్థానిక జనసేన నాయకులు త్యాడ రామకృష్ణ గారు హామీ ఇచ్చారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com