కువైట్ లో జనసేన NRI సేవా సమితి (గల్ఫ్ సేన-జనసేన) ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన 30 కుటుంబాలు

               కువైట్ లో సాల్మియా ప్రాంతంలో కులమతాలకు అతీతంగా జనసేన NRI సేవా సమితి మరియు గల్ఫ్ సేన-జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం కలసి పనిచేయడానికి పెనగలూరు మండలం పొందలూరు గ్రామం, గుడ్లవారిపల్లి, బెస్తపల్లి, రాజంపేట మండలానికి చెందిన మందరం, నందలూరు మండలం పొత్తపి, ఓబులవారిపల్లి మండలం జి వి పురం, చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారి పాళెం మరియు రాజోలుకు చెందిన పలువురు జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరందరినీ రామచంద్ర నాయక్ గారు కండువాలతో స్వాగతం పలుకుతూ పార్టీలోకి ఆహ్వానం పలకడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పగడాల అంజన్ కుమార్ కంచన శ్రీకాంత్ బాబు, గుంటూరు శంకర్, ప్రేమ్ రాయల్, కొత్తపల్లి శ్రీను, బాల రాయల్, పసుపులేటి రాజేష్, శివయ్య, గంటా రమేష్, చాపల రమణ మొదలగు వారు పాల్గొన్నారు. జనసేన నాయకులు  ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన గోవుల ఎల్లయ్య ముదిరాజ్, యనమల శివయ్య, సుబ్బనరసయ్య, గువ్వల పరశురాం, మరియు శంకరకి ధన్యవాదములు తెలియచేసారు. కార్యక్రమంలో కువైట్ లోని జనసైనికులు భారీగా పాల్గొనడం జరిగింది. 

See also  పెరిగిన ధరలతో జీవనం సాగించలేకపోతున్నాం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి