అనారోగ్యంతో బాధపడుతున్న శివ్వాల తనుజ అమ్మాయి కుటుంబానికి రూ. 15000 వేల ఆర్థిక సాయం

                     పాలకొండ నియోజకవర్గ బెజ్జి గ్రామంలో శివ్వాల తనుజ అనే అమ్మాయికి బోన్ క్యాన్సర్ ఉందన్న విషయం తెలియగానే పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు గారు 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.  ఈ సందర్భంగా కుటుంబంతో మాట్లాడి తన ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడే అంతవరకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా పూర్తి స్థాయిలో అందిస్తామని అన్నారు. ఆ కుటుంబానికి పూర్తి భరోసా ఇవ్వడం జరిగింది.  ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పొట్నూరు రమేష్, గర్భపు నరేంద్ర, సాయికిరణ్, ప్రసాద్, సంపత్ కుమార్ భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

See also  విశాఖలో జనసేన ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళల ఆందోళన