మానవత్వంతో రక్తదానం చేసిన జనసైనికుడు

రక్తదానం చేసిన జనసైనికుడు.

          పార్వతీపురం చెందిన కృష్ణ రావు గారు ఆరోగ్యం బాగోలేక పార్వతీపురం కర్షక మహర్షి హాస్పిటల్ లో జాయిన్ అవ్వగా అత్యవసరంగా “”౦ పాజిటివ్ బ్లడ్”” ఎక్కిచాలి అని వైద్యులు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీపురం పాండా వీధికి చెందిన దుర్గాప్రసాద్ జన సైనికుడు మరియు డివైఎఫ్ఐ నాయకులు జంజావాతి, గంగ రాయవలస గ్రామానికి చెందిన తన స్నేహితుడు సాయి మహేష్ గారికి విషయం చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈరోజు ఉదయం కర్షక మహర్షి హాస్పిటల్ కు వచ్చి రక్తదానం చేశారు.సాయి మహేష్ గారికి మరియు దుర్గా ప్రసాద్ గారికి పేషంట్ బంధువుల నుండి మరియు బ్లడ్ డోనర్స్ గ్రూపు నుండి ధన్యవాదాలు తెలిపారు. మహేష్ మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్పూర్తిలో నడవడం సంతోషకరంగా ఉందని, అలాగే ఈ కరోనా విపత్కర సమయంలో రక్తం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అందరూ మానవత్వంతో ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. 

See also  నెల్లూరు జిల్లా జనసేన పార్టీలోకి మహిళల చేరికలు