రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసైనికుడి కుటుంబానికి ఎన్.ఆర్.ఐ. జనసేన రూ. 4,16,224 ఆర్ధిక సాయం

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసైనికుడి కుటుంబానికి ఎన్.ఆర్.ఐ. జనసేన ఆర్ధిక సాయం 

                    గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఇటీవల మృతి చెందిన జనసేన కార్యకర్తలను స్మరించుకుంటూ స్థానిక పార్టీ శ్రేణులు సంస్మరణ సభ ఏర్పాటు చేశాయి. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. ఇటీవల కాలంలో ఎక్కువ మంది జనసైనికులు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న నేపధ్యంలో అంతా స్వీయ భద్రత పాటించాలని దిశానిర్ధేశం చేశారు. మృతి చెందిన జనసైనికుల సేవలను స్మరించుకున్నారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లికి చెందిన జనసైనికుడు మునగా రవి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. విషయం తెలుసుకున్న ఎన్.ఆర్.ఐ. జనసేన యూ.ఎస్.ఎ. విభాగం అతని కుటుంబానికి అండగా నిలిచేందుకు పార్టీ తరఫున కొంత మొత్తాన్ని సేకరించి పంపారు. మొత్తం రూ. 4,16,224 ను చెక్ రూపంలో సంస్మరణ సభలో పార్టీ నాయకుల చేతుల మీదుగా మృతుని తల్లికి అందచేశారు. ఆ కుటుంబానికి పార్టీ తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.. కార్యక్రమంలో సెంట్రల్ ఆంధ్రా సంయుక్త కమిటీ సభ్యులు గాదె వెంకటేశ్వరరావు, పాకనాటి రమాదేవి, చిరంజీవి యువత అధ్యక్షులు, జనసేన నాయకులు శ్రీ తన్నీరు కిషోర్ మరియు స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  కళాశాలలు మరికొన్ని రోజులు మూసివేయాలి : జనసేన ఈమని కిషోర్