రైల్వే కోడూర్ నియోజకవర్గంలోని చిట్వేలు మండలంలో అట్టహాసంగా జనసేన క్రీయాశీలక సభ్యత్వ కార్యక్రమం

రైల్వే కోడూర్ నియోజకవర్గంలోని చిట్వేలు మండలంలో అట్టహాసంగా జనసేన క్రీయాశీలక సభ్యత్వ కార్యక్రమం

                 పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు. పార్టీ కార్యకర్తలకు జనసేనలో పెద్ద పీట వేసిందని జనసైనికుల కొరకు క్రియాశీలక జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందనీ రైల్వే కోడూర్ జనసేన పార్టీ ఇంచార్జ్ వెంకటసుబ్బయ్య, నాయకులు తాతం శెట్టి నాగేంద్ర, జోగినేని మనీ, గిద్దలూరు భానులు అన్నారు. మండల కేంద్రంలో జనసేన యువ నాయకుడు మాదాసు శివ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీకి అండదండ కార్యకర్తలు అన్నారు. అటువంటి కార్యకర్తల కొరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి జనసేన కొరకు శ్రమిస్తున్న కార్యకర్తకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో అధినేత పవన్ కళ్యాణ్ ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అలాగే తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన రైతులను వారి పంటలకు నష్టపరిహారం చెల్లించాలని రైతులకు మద్దతుగా నిలిచిన నాయకుడు పవన్ కళ్యాణ్ ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. సభ్యత్వ నమోదు చేసుకోవడం ద్వారా కార్యకర్తకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు ఆ కార్యకర్త కు కుటుంబానికి అండగా నిలవాలన్నది జనసేన పార్టీ యొక్క లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు కొన్ని శెట్టి చక్రి, ఆనంద మని తేజ, కడుమూరీ నాగరాజు, కృష్ణ, హరి, సువారపు హరి, లోకేష్, నాయిని సురేష్, ఆనందల నాగయ్య, రెడ్డయ్య మారెళ్ళ లక్ష్మణ్ జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

See also  జనసేన ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం