
మానవత్వాన్ని చాటుకున్న జనసైనికులు
ఈ కరోనా విపత్కర సమయంలో సామాన్యులు ఆర్థికంగా క్షీణించడమే కాకుండా, కరోనా ధాటికి జీవితాలు చిన్నా భిన్నం అవుతున్నాయి. ఈ కరోనా సంక్షోభంలో ఇంట్లో వారు మరణిస్తేనే దహన సంస్కారాలు చేయాలంటే భయపడుతున్నారు. అలాంటిది జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ స్పూర్తితో జనసైనికులు తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ఓ మానసిక వికలాంగురాలు అయిన వృద్ధురాలు మృత్యువాత పడ్డారు. ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సైతం ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న గుడివాడ జనసైనికుడు మాచర్ల రామకృష్ణ(ఆర్కే) తన బృందంతో కలసి ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మానవత్వం ఉనికి కోల్పోతున్న పరిస్థితుల్లో ఆ వృద్ధురాలికి జనసైనికులే ఆ నలుగురై పాడె మోసి, అంత్యక్రియలు చేయడం పట్ల సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జనసైనికుడు మాచర్ల రామకృష్ణ(ఆర్కే) మాట్లాడుతూ ఎవరికి ఏం కష్టం వచ్చినా ఆదుకోవడానికి మా జనసైనికులు ముందు ఉంటారని, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో నడుస్తూ మానవత్వాన్ని కాపాడుతామని చెప్పారు.








