
ఆత్మ హత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబంకు జనసేన పార్టీ ఆర్థిక సహాయం
అవనిగడ్డ మండలం మోదుముడి గ్రామానికి చెందిన ఓలేటి ఆదిశేషు(60) సోమవారం అర్ధరాత్రి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు . 7 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పంట వేయగా, నివర్ తుఫాన్ ధాటికి పంట మొత్తం దెబ్బతిని మొలకలు వచ్చాయని, పొలంలో చల్లిన మినుము విత్తనాలు కూడా మొలకెత్తలేదని, చేసిన అప్పులు(సుమారు 3 లక్షలు) తీర్చలేక సోమవారం రాత్రి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. సదరు కౌలు రైతు మరణం గురించి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. నిన్న సాయంత్రం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ నోట్ ద్వారా చనిపోయిన ఒలేటి అదిశేషు గారి కుటుంబంకు సానుభూతి తెలియచేయటం జరిగింది. ఇదే విషయం అవనిగడ్డ నియోజకవర్గ ఇంచార్జి శ్రీ ముత్తంశెట్టి కృష్ణారావు గారి దృష్టిలో పెట్టడం జరిగింది. అయన వెంటనే స్పందించి చనిపోయిన కౌలు రైతు కుటుంబంకు జనసేన పార్టీ తరుపున 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈరోజు 6 మండలాల జనసైనికులం అందరం కలిసి మోదుమూడి గ్రామం వెళ్ళి ఆత్మ హత్య చేసుకున్న అదిశేషు గారికీ నివాళులు తెలిపి, వారి కుమారులకు శ్రీ ముత్తంశెట్టి కృష్ణారావు గారు పంపించిన 10 వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందించటం జరిగింది.
ఇప్పటి వరకు 3 గురు కౌలు రైతులు ఆత్మ హత్యలు చేసుకోవటం చాలా బాధ కరం. జనసేన పార్టీ తరుపున చల్లపల్లి మండలంలో చనిపోయిన కౌలు రైతుకు పవన్ కళ్యాణ్ గారు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చెయ్యటం జరిగింది. అదేవిధంగా అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కౌలు రైతుకు 15 వేలు ఆర్థిక సహాయం చేయటం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వకపోవటం చాలా బాధాకరం. అలాగే తక్షణ సహాయం క్రింద 10 వేలు రైతులకు ఇచ్చి ఆర్థికంగా వాళ్లకు సహాయం చేయండి అంటే ప్రభుత్వం మీనామీసాలు లెక్కిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నష్ట పరిహారం విషయంలో స్పందించకపోవుట వలన ఈ నెల 28 వ తేదీన పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జిల్లా కలక్టర్ గారికీ అన్నీ నియోజకవర్గలు నుండి అర్జీలు ఇవ్వటం జరుగుతుంది.కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన ప్రతి రైతు, కౌలురైతుకు ఎకరానికి 35 వేల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలి. చనిపోయిన రైతు కుటుంబంకు 10 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలి అనీ జనసేన పార్టీ నుండి ప్రభుత్వంను డిమాండ్ చేస్తున్నాము.ఈరోజు ఈ కార్యక్రమంలో బచ్చు వెంకటనాద్ గారు, చెన్నగిరి సత్యనారాయణ, బచ్చు రఘునాద్ గారు, బచ్చు ఆంజనేయులు, శ్రీహరి గారు, అవనిగడ్డ జడ్పీటీసీ అభ్యర్థి గాజుల శంకర్ రావు గారు, కోడూరు జడ్పీటీసీ అభ్యర్థి సిద్దినేని అశోకనాయడు గారు, ఎంపీటీసీ అభ్యర్థి బొప్పన భాను, పృద్వి, మత్తి సుబ్రహ్మణ్యం, బండిరెడ్డి మల్లిఖార్జున రావు,తోట నాగరాజు గారు,తారక మస్తాన్ గారు, షరీఫ్ గారు, చందు, రవి తదితరులు పాల్గొన్నారు.








