
ఏపి సెర్ప్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పల్నాడు జిల్లా కార్యవర్గం ఎన్నిక.
నరసరావుపేట,మే 09( జనస్వరం)
ఏపి సెర్ప్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక వాసవి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో డి ఆర్ డి ఏ వెలుగు కార్యాలయంలోని L1 L2 MSCC మరియు సపోర్టింగ్ సిబ్బంది అందరూ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేసుకొని నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడమైంది. అసోసియేషన్ నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా అబ్బూరి రామారావు శ్యావల్యపురం మండలం,
ఉపాధ్యక్షులుగా చిప్పలపల్లి నాగేశ్వరరావు యడ్లపాడు మండలం,కంచేటి సుజాత నకరికల్లు మండలం,చిలుకూరి నరేష్ రెడ్డి దుర్గి మండలం, సెక్రటరీగా మేకల బుల్లిబాబు సత్తెనపల్లి మండలం, జాయింట్ సెక్రెటరీ లుగా షేక్. బాజీ అచ్చంపేట మండలం, ప్రధాన కార్యాలయం నుండి హనుమంతరావు,కోశాధికారి గా షేక్ నాగుల్ మీరా వలి ,లీగల్ అడ్వైసర్ గా ఇక్కుర్తి నాగ మల్లేశ్వరరావు,ఎడ్లపాడు మండలం సభ్యులను
అందరు సభ్యులు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది..

ఈ సమావేశంనకు పల్నాడు జిల్లా డిఆర్డిఏ వెలుగు ఆధ్వర్యంలోని ఎల్ వన్ ఎల్2 సపోర్టింగ్ స్టాఫ్ మరియు మండల సమైక్య కోఆర్డినేటర్లు పాల్గొనడం జరిగింది.








