రామసింగవరంలో 44వ టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పెదవేగి, మార్చి 29 (జనస్వరం) : పెదవేగి మండలం వ్యాప్తంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మండలంలోని రామసింగవరం గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు దొంగల శ్రీకాంత్ ఆధ్వర్యంలో 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించిన అనతి కాలంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చరిత్ర సృష్టించడం జరిగిందని వారు తెలిపారు. అంతే కాకుండా రాష్ట్ర పరిపాలనలో నూతన అధ్యాయాన్ని నెలకొల్పడం జరిగిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి అడపా శ్రీనివాసరావు, ఎంపీటీసీ గుర్రం మాధవరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

See also  కందివలసలో ప్రజా వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగ మాధవి