
నెల్లూరు, మార్చి 4, (జనస్వరం) : జనసేన పార్టీ నిర్వహిస్తున్న ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దివ్యాంగుల సమస్యలపై మాట్లాడిన నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమేనని పేర్కొంటూ ఆయనకు మద్దతుగా దివ్యాంగులు పాలాభిషేకం నిర్వహించారు. కారుణ్య సేవా సమితి సభ్యులు కూడా జనసేన ఉద్యమి సభ్యత్వంలో చేరి పార్టీకి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కారుణ్య సేవా సమితి సభ్యులు జనసేన ఉద్యమి సభ్యత్వంలో చేరడం ఆనందకరమన్నారు. సమితి అధ్యక్షుడు వెంకట్ గత ఐదేళ్లుగా జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పవన్ కళ్యాణ్ సేవా భావాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతున్నారని తెలిపారు. సమాజంలో ఏ వర్గం వెనుకబడిపోకుండా వారికి ప్రోత్సాహం అందించడమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, వేముల శివకృష్ణతో పాటు కారుణ్య సేవా సమితి సభ్యులు పాల్గొని తమ ఉద్యమి సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు.








