నెల్లిమర్లలో ప్రజాదర్బార్.. వినతులు విన్న ఎమ్మెల్యే మాధవి

నెల్లిమర్ల, ఫిబ్రవరి 22, (జనస్వరం) : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి తెలిపారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌కు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. భూ సమస్యలు, పట్టాదారు పాస్‌పుస్తకాల మార్పులు, చేర్పులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, సీసీ రోడ్ల పనులు, యువతకు ఉపాధి అవకాశాలపై పలువురు వినతిపత్రాలు అందజేశారు. ప్రతి సమస్యను స్వయంగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా దరఖాస్తులపై తక్షణ స్పందన ఉండాలని అధికారులకు సూచించారు. సమస్యల తీవ్రతను బట్టి క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

See also  దేవస్థానం గ్యారేజీ పనితీరుపై అనుమానాలు