బ్రహ్మసముద్రం కోనాపురంలో జనసేన సేవా పోస్టర్ విడుదల

అనంతపురము, జనవరి 28, (జనస్వరం) : అనంతపురం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు టి.సి.వరుణ్, సౌత్ ఇండియా జనసేన పవన్ కళ్యాణ్ సేవా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆనంద్ ఆధ్వర్యంలో బ్రహ్మసముద్రం మండలం కోనాపురం గ్రామంలో సౌత్ ఇండియా జనసేన పవన్ కళ్యాణ్ సేవా అసోసియేషన్ పోస్టర్‌ను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ సేవా అసోసియేషన్ పనిచేస్తోందని నాయకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని, సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కోనాపురం గ్రామంలో జరిగిన ఈ పోస్టర్ విడుదల కార్యక్రమం జనసేన శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.

See also  వైసీపీ మంత్రులపై విరుచుకుపడ్డ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి