
బెస్ట్ సోషల్ యాక్టివిస్ట్ అవార్డ్ అందుకున్న డాక్టర్ జె.వి.ఎస్. భాస్కర్.
చెన్నై.జనవరి 25.( జనస్వరం)
చెన్నైలోని ప్రముఖ AMET యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, సామాజిక సేవకుడు, గ్లోబల్ లీడర్ డాక్టర్ జె.వి.ఎస్. భాస్కర్ కి “బెస్ట్ సోషల్ యాక్టివిస్ట్ అవార్డు”ను ఘనంగా ప్రదానం చేశారు.ఈ అవార్డును AMET యూనివర్సిటీ వ్యవస్థాపకులు డాక్టర్ జె. రామచంద్రన్ మరియు వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజేంద్రన్ సంయుక్తంగా అందజేశారు. సమాజ అభివృద్ధి, విద్యా ప్రోత్సాహం, యువత సాధికారత, సేవా కార్యక్రమాల ద్వారా విశేష సేవలు అందించినందుకు గాను ఈ గౌరవ పురస్కారం అందించారు.అనేక సంవత్సరాలుగా నిరంతరంగా సామాజిక సేవలో నిమగ్నమై, పేదలు, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు మార్గనిర్దేశం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న డాక్టర్ భాస్కర్ సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ జె.వి.ఎస్.భాస్కర్ మాట్లాడుతూ ఈ అవార్డు నాకు మరింత బాధ్యతను పెంచింది. సమాజ సేవే నా జీవితలక్ష్యంగా కొనసాగిస్తాను” అని తెలిపారు. గతంలో కూడా ఆయన తన rss సేవలకు గుర్తింపుగా 2024లో అమెరికన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి “బెస్ట్ సోషల్ యాక్టివిస్ట్ అవార్డు”ను అందుకున్నారు. అలాగే గీతం యూనివర్సిటీ (విశాఖపట్నం), ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ (రాజమండ్రి), ఆదిత్య యూనివర్సిటీ (కాకినాడ) వంటి ప్రముఖ విద్యాసంస్థల నుంచి కూడా విశిష్ట పురస్కారాలు అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో విద్యావేత్తలు, ప్రముఖులు, సామాజిక నాయకులు పాల్గొని డాక్టర్ భాస్కర్ ని ఘనంగా అభినందించారు.








