జనసైనికుడి కుటుంబానికి ఎమ్మెల్యే లోకం మాధవి ఆర్థిక సహాయం

జనసైనికుడి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ సహాయ
పూసపాటిరేగ, అక్టోబర్ 13, (జనస్వరం) : పూసపాటిరేగ మండలం నడిపల్లి గ్రామానికి చెందిన క్రియాశీల జనసైనికుడు పులపా జగదీష్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో అనుకోకుండా మృతి చెందడంతో కుటుంబం, స్నేహితులు, గ్రామ ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ విషాద సమయంలో కుటుంబాన్ని ఆదరించేందుకు నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యురాలు లోకం నాగమాధవి నడిపల్లి గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి హృదయపూర్వకంగా మనోధైర్యం కల్పించారు. కుటుంబానికి అండగా జనసేన నాయకులు కలసి ఆమె చేతుల మీదుగా మొత్తం 80,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కుటుంబాలతో కలిసి నిలబడుతుందని, భవిష్యత్తులో ఏవైనా అవసరాలు ఏర్పడితే కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని కుటుంబానికి సానుభూతి తెలిపారు.

See also  జనసేన నాయకులు మర్రాపు సురేష్ ప్రసాదం వితరణ