కవి గుండ్లూరు సుబ్రహ్మణ్యంకు సత్కారం

గుండ్లూరు సుబ్రహ్మణ్యం

మదనపల్లి, జనవరి 11 : సీనియర్ కవి, రచయిత, గాయకుడు, నటుడు గుండ్లూరు సుబ్రమణ్యంను ఆదివారం ఘనంగా సత్కరించారు. కనకదాస ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మెన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ డా. కె. పరంధామ గౌడ్ ఆర్థిక సహయంతో మెడిసిన్ విద్యార్థులకు అవసరమైన పరికరాలు, ఒక్కోకరికి ఐదువేల రూపాయలు నగదు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రచయిత, నంది అవార్డు గ్రహీత గుండ్లూరు సుబ్రహ్మణ్యం హాజరై మాట్లాడారు. వైద్యులు మానవత్వంతో సేవలు కొనసాగించాలన్నారు. ముఖ్యంగా కాన్పుల సమయంలో అనవసర ఆపరేషన్లు చేయరాదన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు సేవాభావాన్ని పెంపొందించుకోవాలన్నారు. ప్రతిభావంతులైన కురుబ సామాజిక వర్గ విద్యార్థులను మరింతగా ప్రోత్సహించాలన్నారు. అనంతరం గుండ్లూరు సుబ్రహ్మణ్యంకు శాలువా కప్పి, జ్ఞాపికను అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా డా. కె. పరంధామ గౌడ్ కు కార్యక్రమ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. మర్రిపాటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

See also  ఔషధ మొక్కలతో మెరుగైన వైద్యం : సీఈవో ఆవుల చంద్రశేఖర్