
పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయండి ➖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
నరసరావుపేట,డిసెంబర్10.( జనస్వరం)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాస్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమానికి సంబంధించి నరసరావుపేటలోని పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా పార్లమెంటరీ పరిశీలకులు పూనూరు గౌతమ్ రెడ్డి, పల్నాడు జిల్లా టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు టీ జె సుధాకర్ బాబు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కందుల రవీంద్రారెడ్డి, పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ,మాజీ మంత్రి చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త నంబూరి శంకర్రావు, సత్తనపల్లి నియోజకవర్గ సమన్వయ కర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర, జిల్లా ఉపాధ్యక్షులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా సంసాగత కమిటీల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు పార్టీ చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలోని అన్ని గ్రామాలు వార్డులలో పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని,తద్వారా పార్టీని బలోపేతం చేయాలని తెలియజేశారు.








