బాలరామ విగ్రహ ప్రతిష్ఠ 2వ వార్షికోత్సవ సందర్భంగా శోభా యాత్ర నిర్వహించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్,నారాయణ సేన నగర సంకీర్తన సభ్యులు

అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రతిష్ఠ 2వ వార్షికోత్సవం సందర్భంగా సత్తెనపల్లిలో శోభా యాత్ర నిర్వహించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరియు నారాయణ సేన నగర సంకీర్తన సభ్యులు.

సత్తెనపల్లి.డిసెంబర్ 31.(జనస్వరం)

అయోధ్యలో బాలరామ ప్రాణప్రతిష్ట 2వ వార్షికోత్సవ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, నారాయణ సేన నగరసంకీర్తన సభ్యులు, ఇతర హిందూ బంధువులు సాయంత్రం 6 గంటలకు మెయిన్ రోడ్డులోని వాసవీ అమ్మవారి గుడి నుండి కట్టమూరివారి వీధిలోని రామాలయం వరకు పూలమాలను రామనామంతో శోభాయాత్రగా తీసుకువెళ్లి స్వామివారికి సమర్పించడం జరిగింది.నారాయణ సేన నగర సంకీర్తన కార్యనిర్వాహక సభ్యులు అన్నo రమణ మాట్లాడుతూ 500 సంవత్సరాల సుదీర్ఘ సంఘర్షణ తర్వాత మనందరి కృషి ఆర్థిక సహకారంతో హిందువుల స్వప్నసాకారమై ప్రశాంత వాతావరణంలో అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో భవ్యమైన దివ్యమైన మందిర నిర్మాణం చేసుకొని బాలరామని ప్రతిష్ట జరుపుకొని రెండు సంవత్సరాల పూర్తయిందని, ఇప్పటికే కోట్లాదిమంది బాలరామ దర్శనం చేసుకున్నారని,అనేక ఉపఆలయాల నిర్మాణంతో పాటు,ఆలయశిఖరం పై కాషాయ విజయధ్వజ ఆవిష్కరణ కూడా జరిగిందని తెలుపుతూ, అయోధ్య శ్రీరామమందిర వివరాలు వివరించారు.

అనంతరం గాంధీచౌక్ లో ఉన్న వినాయక దేవాలయంలో శ్రీరామ చిత్రపటం ఉంచి పూజలు, భజనలు నిర్వహించి తదనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిపారు.

See also  బాపట్ల నియోజకవర్గంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు