సాయికృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధ్వర్యంలో మెగా వైద్య శిబిరం – డాక్టర్ సింగరాజు సాయికృష్ణ.

సాయికృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం విజయవంతం –డాక్టర్ సింగరాజు సాయికృష్ణ,డాక్టర్ సింగరాజు విద్య.

సత్తెనపల్లి,డిసెంబర్27.( జనస్వరం)

మండలంలోని నందిగామ గ్రామంలో సాయికృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో సింగరాజు చారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించందని ఆసుపత్రి ఎండీ డాక్టర్ సింగరాజు సాయికృష్ణ తెలిపారు.ఈ శిబిరంలో సాయికృష్ణ ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు మరియు విషజ్వరాలు పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు హాజరైన రోగులకు అవగాహన కల్పించారు.ఈ శిబిరంలో బీపీ,షుగర్,జ్వరాలు నెమ్ము,ఆయాసం, ఉబ్బసం, జలుబు,దగ్గు,థైరాయిడ్ సమస్యలు మరియు అన్ని జనరల్ వ్యాధులకు ఊపిరితిత్తుల వ్యాధులకు ఉచితంగా (ఈసీజీ,Random షుగర్, థైరాయిడ్ ప్రొఫైల్, Hb1Ac)పరీక్షలు చేసి సుమారు 250 మందికి వైద్య సేవలు అందజేశారు.అలాగే అవసరమైన రోగులకు మందులు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న డాక్టర్ సింగరాజు సాయికృష్ణ,డాక్టర్ సింగరాజు విద్యలను నందిగామ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బలిజెపల్లి రమాదేవి, గ్రామ పెద్దలు ఆళ్ళ అమరేశ్వర రావు,ఆళ్ళ సాంబయ్య , బలిజెపల్లి విజయకుమార్, పులిగడ్డ నాగ ఆంజినేయులు, శొంఠినేని మార్కండేయులు, నందిగామ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

See also  ఆవిర్భావ దినోత్సవ సభను అడ్డుకోవడం సమంజసం కాదు: దాచేపల్లి మండల జనసేన నాయకులు