ఘనంగా పట్టణంలో మహానటి సావిత్రి వర్ధంతి వేడుకలు.

పట్టణంలో మహానటి సావిత్రి వర్ధంతి వేడుకలు

సత్తెనపల్లి,డిసెంబర్ 26.(జనస్వరం)

పట్టణంలో స్థానిక ఎన్టీఆర్ కాళా క్షేత్రంలో దివంగత మహానటి సావిత్రి 44 వ వర్ధంతి సందర్భంగా సావిత్రి అభిమానులు కంఠంనేని వెంకట సాంబశివ రావు మెమోరియల్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. తొలిత సావిత్రి విగ్రహానికి సీనియర్ రంగస్థలం నటుడు ముట్టె రాంబాబు, బత్తినేని వెంకట లక్ష్మయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

 

ఈ కార్యక్రమంలో ఫోటో స్టూడియో సంఘం నాయకులు జవంగుల శ్రీనివాస్, ప్రజానాట్యమండలి సత్తెనపల్లి పట్టణ గౌరవాధ్యక్షులు కంబాల శ్రీనివాస్,ప్రజానాట్యమండలి సెక్రటరీ వి . చెన్నకేశవులు, అంకాళ్ళ ప్రభుదాస్, కాటుమాల నాగేశ్వరరావు, అంకాళ్ళ నాగరాజు, కాటుమాల దావీదు, భవిరిశెట్టి భద్రయ్య,పిల్లుట్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

See also  దివ్యాంగుల 2016 హక్కుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలి? జనసేన నాయకులు గోగన ఆదిశేషు