వైభవోపేతంగా అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు – చైర్మన్ అట్లూరి విజయ్ కుమార్

అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగ రంగ వైభవంగా సెమీ క్రిస్మస్ వేడుకలు – చైర్మన్ అట్లూరి విజయ్ కుమార్

నరసరావుపేట,డిసెంబర్24(జనస్వరం )

పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్ లో అమ్మ ఫౌండేషన్ ( స్వచ్ఛంద సేవా సంస్థ2006) ఫౌండర్ అట్లూరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పేదోడి అండ 21 ఏళ్ల ప్రస్థానంతో 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించు కొని నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు విచ్చేసిన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చందవోలు శోభారాణి, నల్లపాటి రామచంద్ర ప్రసాద్ రాష్ట్ర టిడిపి సెక్రెటరీ,పగడాల శివపార్వతి,రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, ప్రముఖ సినీనటి కే మాధురి లతా,MDPS జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న, ఎండిపిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ మరికొందరు సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు, అమ్మ ఫౌండేషన్ స్థాపించి తన 21 ఏళ్ల ప్రస్థానంలో ఎంతోమంది పేద కుటుంబాలకు మరియు పేద విద్యార్థులకు అండగా ఉంటూ ఎంతో సేవా దృక్పథంతో ప్రతి పేదవాడికి మీకు అండగా నేను ఉన్నాను అని భరోసాను కల్పిస్తూ వారికి ఏ అవసరం ఉన్న అమ్మా ఫౌండేషన్ ద్వారా వారిని విద్య ఆర్థికపరంగా ఆదుకుంటూ ఎంతోమంది పేద విద్యార్థులకు తనవంతు సహాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారని అలానే రాబోయే కాలంలో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ భవిష్యత్తులో అంచలంచలుగా ఎదగాలని అమ్మ ఫౌండేషన్ పేరు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే విధంగా ప్రసంగించిన ప్రతి ఒక్కరూ మా వంతు కృషిగా మేము మీకు తోడుగా ఉంటామని అన్నారు.

అనంతరం అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన ఫౌండర్ అట్లూరి విజయ్ కుమార్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మ ఫౌండేషన్ తరపున శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు చేతుల మీదుగా పాస్టర్ లకు పేద మహిళలకు వృద్ధులకు వస్త్రాల పంపిణీ చేసి తదనంతరం కేక్ కట్ చేసి గిఫ్ట్ లు ఇవ్వటం జరిగింది మరియు రాష్ట్ర ప్రజలకు మరియు అమ్మ ఫౌండేషన్ సభ్యులకు సెమీ క్రిస్మస్ వేడుకలు శుభాకాంక్షలు తెలియజేశారు.

See also  దివ్యాంగుల ఉద్యోగస్తులకు బయోమెట్రిక్ విధానం తీసివేయాలని డిమాండ్