కదిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో రైతుల కోసం నిరసన దీక్ష

కదిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో రైతుల కోసం నిరసన దీక్ష

          తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారంగా ఎకరానికి రు.35వేలు,తక్షణ సాయంగా రూ10,000 ఇవ్వాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారుడిమాండ్ చేశారు.ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో రైతాంగానికి అండగా నిలిచేందుకు ఈ రోజు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన నివాసంలో ఉదయం పదిగంటలకు దీక్షలో కూర్చున్నారు. మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షకు మద్దతుగా ఈరోజు కదిరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ P.C. భైరవ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కదిరి తహసీల్దార్ ఆఫీసు ముందు నిరసన కార్యక్రమం చేపట్టి ఆ తర్వాత కదిరి తహశీల్దార్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నివర్ తుఫాన్ వల్ల ఆర్థికంగా నష్టపోయిన రైతులను ఆదుకొని తక్షణ సహాయం కింద 10000₹,ఎకరాకు 35 ₹ రూపాయలు వారికి అందించాలని జనసేన పార్టీ తరపున ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కదిరి టౌన్ అధ్యక్షుడు చలపతి, భూక్యరత్నమ్మ, కిన్నెర మహేష్ గారు, లక్ష్మణ కుటాల, మేకల చెరువు చౌదరీ, ఆంజనేయులు, భాస్కర్, అఖిల్, మారుతి, అశోక్, పవన్, మని, తదితర జనసైనికులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది.

See also  డ్రైనేజీ సమస్య తక్షణ పరిష్కారం చేయాలి : అరకు జనసేన నాయకులు