
పల్నాడులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన వైసీపీ ర్యాలీలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు.
నరసరావుపేట,డిసెంబర్15.(జనస్వరం)
పల్నాడుజిల్లా కేంద్రంగా ఉన్న నరసరావుపేటలో జరిగిన మెడికల్ కాలేజీల ప్రవేటికరణకు వ్యతిరేకంగా వైసిపి చేపట్టిన కోటి సంతకాల ప్రతులను తాడేపల్లి కేంద్రకార్యాలయానికి చేర్చే సందర్భంగా జరిపిన బైక్ ర్యాలీ లో పెదకూరపాడు మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు మాట్లాడుతూ తక్కువలో తక్కువ ఎకరం కోటి రూపాయలు విలువ తీసుకున్నా 50కోట్ల స్థలం 400కోట్ల విలువైన నిర్మాణాలను మరియు ప్రభుత్వ జీతాలతో ఉద్యోగులను ఇస్తూ అతి తక్కువకు తన అనుయాయులకు 66సంవత్సరాల లీజుకు కట్టబెడితే ప్రజలకు మేలు చేస్తున్నట్టా అని ప్రశ్నించారు.

ప్రభుత్వ అధీనంలో నడిపితేనే ప్రజలకు విద్యార్థుల కు నాణ్యమైన విద్యా వైద్యం లభిస్తాయి. అన్నీ ప్రభుత్వం చేకూర్చి ప్రయివేట్ వ్యక్తులకు లబ్దిచేకూరిస్తే ఏమని అర్ధం అన్నారు. ఈ విషయం లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే వైసీపీ చూస్తూ ఊరుకోదని కోటి సంతకాలు కాస్త కోటను కూల్చేదాకా వెళ్తుందని ఏ ప్రభుత్వమైన విద్యా వైద్యాన్ని సక్రమంగా అందిస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారన్నారు.








