
పిఠాపురం, అక్టోబర్ 05, (జనస్వరం) : కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమాలు పిఠాపురం నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ కార్యక్రమాలకు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు పైమాన్ కమిటీ సభ్యులు పెండెం దొరబాబు, ఓదురి కిషోర్, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ వాకాపల్లి దేవి సూర్య ప్రకాష్, కార్పొరేషన్ డైరెక్టర్స్ చల్లా లక్ష్మి, పెంకే జగదీష్, మొగిలి అప్పారావు, సూరిశెట్టి జయకృష్ణ, పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ బొజ్జ కుమార్, జనసేన నాయకులు, మహిళా జనసైనికులు, విద్యా కమిటీ చైర్మన్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమన్వయం విద్యార్థుల భవిష్యత్ నిర్మాణానికి ఎంత కీలకమో ఈ సందర్భంలో నిర్వాహకులు వివరించారు. పాఠశాలల్లో జరుగుతున్న మార్పులు, మెరుగుదల చర్యలు తల్లిదండ్రుల సహకారంతో మరింతగా బలపడతాయని వారు తెలిపారు.









