నెల్లిమర్ల నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ నిధుల పంపిణీ

నెల్లిమర్ల, నవంబర్ 12, (జనస్వరం) : నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి భోగాపురం ఎంపీడీవో కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి ఉపశమన నిధి) ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 14 మంది లబ్ధిదారులకు రూ.10,65,388 రూపాయల ఆర్థిక సహాయం మంజూరు చేయబడింది. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ప్రజల సమస్యలను తెలుసుకుంటూ మాట్లాడిన లోకం నాగ మాధవి “ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య సహాయం అందించడం ద్వారా ప్రభుత్వం ప్రజల పక్షాన నిలుస్తోంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రజలతో మమేకమై, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడి దాకా చేరేలా కృషి చేయాలని అధికారులు సూచించారు.

See also  పల్లె పల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటించిన జనసేన నాయకులు మర్రపు సురేష్