భక్త కనకదాసు జీవితం లోకానికి స్ఫూర్తిదాయకం

– నగరంలో ఘనంగా కనకదాసు జయంతి ఉత్సవాలు
– కురుబ యువత రాష్ట్ర అధ్యక్షులు బిల్లే మంజునాథ్

అనంతపురం, నవంబర్ 8, జనస్వరం : కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాసు జీవిత చరిత్ర ఈ లోకానికి స్ఫూర్తిదాయకమని ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాల నడవాలని ఆయన పిలుపునిచ్చారు. కనకదాసు జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం నగరంలోని గుత్తి రోడ్డు నందు ఉన్న కనకదాస విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనంత మాజీ మేయర్ రాగే పరుశురాం, రాష్ట్ర కురువ యువత అధ్యక్షులు బిల్లే మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ భక్త కనకదాసు జీవితంలో ఎన్నో విశేషాలను నేటి ప్రజలు ఆయన అడుగుజాడలను నడుచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆనాడు ఆయనకు ఆయన భక్తికి మెచ్చి శ్రీకృష్ణుడే సాక్షాత్తు దైవదర్శనం ఇచ్చినటువంటి గొప్ప వాగ్గేయకారుడని పేర్కొన్నారు. నేటి కురవ కులానికి ఆరాధ్య దైవంగా భావించడం మన అందరి అదృష్టం అని వారు పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత ప్రభుత్వం కురువులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాల నిర్వహించిన ఘనత కూడా దక్కుతుందనన్నారు గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని అధికారిక పండుగగా కనకదాసు జయంతిని గుర్తించామని అన్నారు. ఎన్నో కీలక పదవులను కూడా జగన్మోహన్ రెడ్డి కురవ కులస్తులకు ఇచ్చి గౌరవ పరిచిన ఘనత మాకు దక్కుతుందని బిల్లే మంజునాథ్ పేర్కొన్నారు. రాప్తాడు మాజీ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ మేయర్ రాగే పరశురామ్, మరియు బిల్లే మంజునాథ్ మరియు కులనాయకులు యువత పాల్గొన్నారు

See also  పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించే హక్కు వైసీపీ నాయకులకు లేదు : బాల్యం రాజేష్