డా. బీఆర్ఏయూలో హెర్బల్ గార్డెన్

– స్థల పరిశీలన చేసిన సిఈఓ ఆవుల చంద్రశేఖర్

ఎచ్చెర్ల, శ్రీకాకుళం, నవంబర్ 07, జనస్వరం : సమాజహిత, ఆరోగ్యకరమైన ఔషధ మొక్కలను పది హెక్టార్లులో డా. బీఆర్ అంబేద్కర్ యూనివర్శిటీలో పెంచనున్నారు. దీని కోసం చేసిన హెర్బల్ గార్డెన్ ప్రతిపాదనల పరిశీలనకు ఆంధ్ర ప్రదేశ్ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు (విజయవాడ) అధికారులు శుక్రవారం వర్శిటీలో వర్యటించారు. కేంపస్ లో అనువైన ప్రదేశాలను వర్శిటీ ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం, వర్శిటీ సెమినార్ హల్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సైన్స్ కళాశాల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు సీఈఓ ఆవుల చంద్రశేఖర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఔషద మొక్కలు పెంచడం వలన భావితరాలకు కాలుష్యరహిత సమాజాన్ని అందించిన వారమవుతామన్నారు. గంజాయి వంటి సాగుకు, వ్యసనాలకు యువతరం దూరంగా ఉండి ప్రయోజకరమైన చెట్లు నాటేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ బోర్డు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి కె.ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, ఔషధరంగ విద్యా అభ్యసనలో స్వల్పకాలిక కోర్సులు కూడా చేసినట్లయితే మంచి ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. కార్యక్రమానికి ముందు ఔషద, సుగంధ మొక్కల బోర్డు అధికారులు… వైస్- ఛాన్సలర్ ఆచార్య కె.ఆర్.రజనితో వీసీ ఛాంబర్ లో భేటీ అయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి ప్రతిపాదిత హెర్బల్ గార్డెన్ తమ వర్శిటీలో త్వరతగతిన పూర్తి అయ్యేలా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. డా. బీఆర్ఏయూను సందర్శించిన సందర్భంగా బోర్డు అధికారులను సత్కరించి జ్ఞాపికలను వీసీ అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య బి. అడ్డయ్య, పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య పి. సుజాత, అకడమిక్ అఫైర్స్ డీన్ డా. కె. స్వప్నవాహిని, ఆర్ అండ్ డి డీన్ డా. ఎన్. లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

See also  ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్బంగా పాలకొండలో జనసైనికుల అధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు