డ్వామా జేసీ ప్రతినిధులు పెండింగ్ జీతాలపై వినతి సమర్పణ

పుట్టపర్తి, అక్టోబర్ 6, (జనస్వరం) : శ్రీ సత్య సాయి జిల్లా MGNREGS DWMA JAC ఉపాధి హామీ సిబ్బంది ఈరోజు కొత్తచెరువు మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్ ను కలిసి, సాంకేతిక సహాయకుల సమస్యలు, పెండింగ్ జీతాలు మరియు ఇతర వెల్ఫేర్ అంశాలపై రిప్రజెంటేషన్ అందజేశారు. రెండు నుంచి నాలుగు నెలలుగా జీతభత్యాలు పెండింగ్‌లో ఉండటం, 23% PRC అమలు, గ్రేడ్ ఫిక్సేషన్, జీతాల్లో వ్యత్యాసాలు, గ్రాట్యుటి అమలు, ఔట్సోర్సింగ్ సిబ్బందిని FTE లుగా మార్చడం, ప్రమోషన్లు, హెల్త్ కార్డులు వంటి కీలక సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. ఈ వినతిపత్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పంపించి తగిన చర్యలు తీసుకునేలా చూస్తామని చైర్మన్ పూల శివప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్వామా JAC ప్రెసిడెంట్ మనోహర్, టెక్నికల్ అసిస్టెంట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పసుపులేటి శ్రీనివాసులు, యూనియన్ నాయకులు నంజప్ప, వీరాంజనేయులు పాల్గొన్నారు.

See also  ఉరవకొండలో జనఘోష - జనసేనభరోసా కార్యక్రమం