
అల్లూరి సీతారామరాజు, అక్టోబర్ 28 (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో ప్రతి జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ముందుండాలని కోరుతూ, జనసేన పార్టీ అరకు నియోజకవర్గ నాయకులు శెట్టి ఆనంద్ పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో తుఫాను ప్రభావం కారణంగా ఎటువంటి అసంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన కూటమి శ్రేణులకు సూచించారు. అలాగే “ప్రభుత్వ యంత్రాంగానికి పార్టీ శ్రేణులు సహకరించాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ప్రణాళికలతో ప్రజలను ఆదుకోవాలి. ప్రభుత్వ సూచనలు, జాగ్రత్తలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అండగా నిలవడం ప్రతి నాయకుడి సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని కోరారు. మోంథా తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన రైతులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దు. కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ప్రభుత్వ సహాయంతో పాటు నా వ్యక్తిగత సహాయం కూడా నిరంతరం అందుబాటులో ఉంటుందనీ, అరకు మరియు పాడేరు నియోజకవర్గాల ప్రజలు ఎటువంటి సహాయం అవసరమైనా వ్యక్తిగత ఫోన్ నంబర్: 8688282266 ద్వారా సంప్రదించవచ్చని శెట్టి ఆనంద్ తెలిపారు.








