కర్నూలులో ప్రధాని మోదీకి ఘన స్వాగతం – జనసేన నేత భవానీ రవికుమార్

కర్నూలు, అక్టోబర్ 16 (జనస్వరం): కర్నూలులో జరిగిన “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” బహిరంగ సభకు విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ & జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు భవానీ రవికుమార్ గారు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భవానీ రవికుమార్ మాట్లాడుతూ, దేశాభివృద్ధి దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపడుతున్న సంస్కరణలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని అభినందించారు. ముఖ్యంగా “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” కార్యక్రమం ద్వారా వ్యాపారులు, సాధారణ ప్రజలు, మరియు రవాణా రంగానికి గణనీయమైన లాభం కలుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా ప్రయోజన నిర్ణయాలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయని తెలిపారు. “దేశం పురోగమించాలంటే పారదర్శక పాలన, ప్రజల విశ్వాసం, మరియు ఆర్థిక సంస్కరణలు సమానంగా నడవాలి. ఈ దిశగా ప్రధాని మోదీ నాయకత్వం దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోంది,” అని అన్నారు.

See also  సీసీ రోడ్డు నందు గుంతలు, డ్రైనేజ్ సమస్యను పరిష్కరించండి