
గాజువాక 65వవార్డు లో శిథిలా స్థితికి కి చేరుకున్న అంగన్వాడీలు : జనసేన వీర మహిళ రెయ్యి రత్న
గాజువాక 65వవార్డులో ఉన్న సంజీవ్ కాలనీ ప్రియదర్శిని కాలనీ అంగన్వాడీలు శిథిలా స్థితికి చేరుకున్నాయి. గతంలో జోనల్ కమిషనర్ గారికి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ నేటికీ ఎటువంటి స్పందన అధికారులలో లేకపోవడం గమనర్హం. వర్షాకాలం సమయంలో పిల్లలతో అంగన్వాడీలో ఉండాలి అంటే భయంగా ఉంది. పై స్లప్ ముక్కలు విరిపడుతున్నాయ్ అని వర్షపు నీరు అంత కూడా చెమ్మల మొత్తం నీళ్లు లోపలికి వచేస్తున్నాయి. అయితే ఈ విషయం పై మా పై అధికారులకు దఫాదఫాలుగా తెలియజేసిన ఎటువంటి స్పందన లేదు అని అంగన్వాడీ టీచర్లు వాపోతున్నారు. అయితే ఈ విషయంపై రెయ్యి రత్న గతంలో పలుమార్లు మెయిన్ కమిషనర్ గారికి ఆన్లైన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తగు మీ జోన్ అధికారులకు మీ కంప్లైంట్ ను ఫార్వర్డ్ చేస్తాం అన్నారు. కానీ నేటికీ ఎటువంటి స్పందన లేదు, అలాగే సంజీవీగిరి కాలనీ ఈరోజు వరకు ఎటువంటి అంగన్వాడీ జీవీఎంసీ భవనం లేదు అద్దె భవనంలో అంగన్వాడీని నిర్వర్తిస్తున్నారు. ఉన్న భవనాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం లేదు. తక్షణమే అంగన్వాడీ లకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని మా జనసేన పారీ తరుపున డిమాండ్ చేస్తున్నాము అని రెయ్యి రత్న తెలియజేసారు.








