Search
Close this search box.
Search
Close this search box.

ముస్లిం మైనార్టీలకు అపద్దపు హామీలనుచెప్పి నిలువునా మోసగించిన జగన్ రెడ్డి

    అనంతపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా 39వ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం లోని స్థానిక 18వ డివిజన్ గుల్జారీ పేట నందు మహిళలతో మాటమంతి కార్యక్రమాన్ని నిర్వహించి స్థానిక మహిళలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముస్లింలకు జగన్ మోహన్ రెడ్డి అపద్దపు హామీలను ఇచ్చి మోసగించాడని.. ఒక్క ఛాన్స్ అంటూ ముస్లింలపై ప్రత్యేక అభిమానం ఉన్నట్లు నటించి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ముస్లిం మైనారిటీలకు తీరని అన్యాయం చేశారని అన్నారు. ముస్లింల అభ్యున్నతి కోసం గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని దుల్హన్ పథకంతో మొదలుకొని రంజాన్ తోఫా, విదేశీ విద్య, తత్కాల్, దుకాణ్ మకాన్, ఇస్లామిక్ బ్యాంకు పథకాలకు వైసీపీ మంగళం పాడిందని ఇమామ్ మౌజాన్లకు అందజేసే గౌరవ వేతనం 15వేల రూపాయలు గృహాల మంజూరు మసీదుల మరమ్మతులకు నిధులు కేటాయించలేదని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి షాదీ ఖానా హామీ మరిచారని హాజ్ యాత్రకు ఆర్థిక సహాయం కరువైందని ముస్లింలకు సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయని చెప్పిన పథకాలు ఏమి అమలు చేయక జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతూ ముస్లింలను మోసం చేశాడని అన్నారు. ఈసారి కచ్చితంగా ముస్లిం మైనారిటీలు జనసేన టీడీపీ పార్టీలకు ఓటు వేయాలని తప్పకుండా మీ అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, టీడీపీ 18వ వార్డు ఇంచార్జీ ముస్తఖాన్, వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way