కదిరి ( జనస్వరం ) : గాండ్లపెంట మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు యువకులు, చామలగొంది మాజీ ఉప సర్పంచ్ రామ్మోహన్ అధ్వర్యంలో జనసేన పార్టీ మండల కన్వీనర్ రవింద్ర నాయక్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికీ కదిరి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ భైరవ ప్రసాద్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంలోనే స్వతంత్ర సమరయోధులు గాజుల నరసయ్య గారి కుమార్తె అయిన సత్యవతి విజయవాడ పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చేరిన శుభ సందర్భంగా అమే ఇంచార్జ్ భైరవ ప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు .ఈ సందర్భంగా ఇన్చార్జ్ భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో సత్యవతి గారికి సన్మానించి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వo చేస్తున్న అక్రమాలు భుదోపిడి అక్రమాలు అంగన్వాడీ కార్యకర్తల పై దౌర్జన్యం చేస్తున్న దుర్మార్గమైన ప్రభుత్వాన్ని గద్దె దించాలనే సంకల్పం తో జనసేన పార్టీలో చేరడం జరిగిందని సత్యవతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ అద్యక్షుడు చలపతి, గాండ్లపెంట, నల్లచెరువు,NP కుంట మండల కన్వనర్లు రవీంద్ర నాయక్,రవికుమార్, చౌదరి, టౌన్ ప్రధానకార్యదర్శులు అంజిబాబు, ప్రతాప్, వంశీ, రాహుల్, శివయ్య, చంద్రమోహన్, రఘు, భాషా, శంకర్ నాయక్, ఈశ్వర్ నాయక్, సునీత, శ్యామల, మహేష్, పార్వతీ తదితరులు పాల్గొన్నారు.