విజయబాబును కలిసిన నల్లాని రాజేశ్వరి

     అనంతపురము, ( జనస్వరం ) :  ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం అధ్యక్షులు పి. విజయబాబును ప్రముఖ రచయిత్రి, కేంద్ర ప్రభుత్వ “రాజ్యమహిళా సమ్మాన్” అవార్డు గ్రహీత, ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నల్లాని రాజేశ్వరి మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనను స్థానిక రోడ్లు, భవనాల అతిథిగృహంలో కలిసి ఆత్మీయంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర అధ్యక్షుడు, సాహిత్యభారతి అధ్యక్షుడు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు పాల్గొన్నారు.

See also  తృణమూల్ గూండాలను శిక్షించాలని ఇంట్లో దీక్ష చేపట్టిన బీజేపీ అధికార ప్రతినిధి దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి