ఫార్మా కంపెనీ వ్యర్దాలను వీలైనంత త్వరగా తొలగించాలి : జనసేన బాడిశ మురళీకృష్ణ

ఫార్మా కంపెనీ వ్యర్దాలను వీలైనంత త్వరగా తొలగించాలి : జనసేన బాడిశ మురళీకృష్ణ

             జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామ సమీపంలో గల కెమికల్ కర్మాగారలు నుండి వెలువడుతున్న కెమికల్ వ్యర్థ రసాయనాలను నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బాడిశ మురళీకృష్ణ బృందం సందర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ వేదాద్రి గ్రామ సమీపాన ఉన్న ఫార్మా కెమికల్ కర్మాగారాల నుండి వెలువడుతున్న వ్యర్థ రసాయనాలను పబ్లిక్ స్థలాల్లో మరియు ప్రజావాసాల మధ్యలో మరియు రోడ్లపైకి యదేచ్చగా వదులుతున్నారు. ఆ వ్యర్థ నీటిని వదలడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు మరియు కర్మాగారం రహదారి గుండా ప్రయాణిస్తున్న వారు ఆ దుర్వాసనకు తట్టుకోలేక అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని, ఆ వ్యర్దాన్ని ఆలా వదలడం వల్ల భూమిలోకి ఇంకిపోవడంతో భూగర్భ జలాలు కూడ కలుషితమవడంతో ప్రజలు అనేక రకాల జబ్బులు కు గురవుతున్నారని అన్నారు. ఆ వ్యర్థ నీటిని వదిలిన సంబంధిత స్థలాలలో పచ్చగా ఉన్న చెట్లు కూడా ఎండిపోవడంతో ఆ వ్యర్థ రసాయన నీరు ఎంత ప్రమాదకరమో తెలుస్తుందన్నారు. పొరపాటున ఆ నీటిని మూగజీవులు తాగితే తరువాత జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారని దయచేసి స్థానిక అధికారులు సంబంధిత కర్మాగార యాజమాన్యానికి నోటీసు చేసి ఆ వ్యర్దాలని తొలగించేలా చూడాలని మురళీకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల జనసైనికులు నవీన్, ప్రశాంత్, గోపి , కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

See also  జనసేన పార్టీ పోరాట ఫలితంగా పేదలకు టిడ్కో ఇళ్లు