గ్రామస్థాయిలో జనసేన బలోపేతం లక్ష్యం : సూర్యరావు పేట గ్రామ జనసేన పార్టీ

గ్రామస్థాయిలో జనసేన బలోపేతం లక్ష్యం : సూర్యరావు పేట గ్రామ జనసేన పార్టీ

             తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండల పరిధిలో, సూర్యారావు పేట గ్రామంలో శెట్టిబలిజ కళ్యాణ మండపం ప్రాంగణంలో, కొత్త జనసేన కమిటీ అధ్యక్షుడిగా యం సూర్య కిరణ్, ఉపాధ్యక్షులుగా, ఎల్ ప్రసాద్,కే రమేష్ సెక్రెటరీ, కే బాలాజీ స్వామి కోఆర్డినేటర్, సోషల్ వీడియో జనసేన ప్రతినిధిగా వనం సూరిబాబు ఎన్నికైనందుకు, అభినందనలు తెలిపారు బండారు శ్రీనివాస్ గారు మరియు మండల స్థాయి నాయకులు. వీరి ఆధ్వర్యంలో సుమారు 50 మంది కార్యకర్తలు, యువకులు జనసేన పార్టీకి, ఆకర్షితులై, జనసేన పార్టీ సేవా కార్యక్రమాల పట్ల, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల, కొత్తపేట నియోజక వర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ పట్ల, విధేయత తెలుపుతూ, జనసేన పార్టీ అడుగుజాడల్లో నడుస్తామని అన్నారు.  అధికారం లేకపోయినా తమ వెంటే ఉంటామని, బండారు శ్రీనివాస్ కు మాట ఇస్తూ, కష్టసుఖాల్లో ముందుకు వచ్చే జన సైనికులకు, గల్ఫ్ జన సైనికులకు, నియోజకవర్గ నాయకులకు, అనునిత్యము వారి సూచనలు సలహాలతో, పార్టీని ముందుకు తీసుకు వెళ్తామని, లాక్ డౌన్ లోనూ కరోనా సమయంలోనూ, నిత్యావసర వస్తువులు, ఆహార ప్యాకెట్లు, శానిటైజర్ వస్తువులు ఆక్సిజన్, రక్తదానం ఇచ్చి ప్రాణాలు నిలబడుతున్న జనసైనికులకు, వందనాలు తెలియజేసారు.  ఇలాంటి సేవా కార్యక్రమాలకు మేము ఆకర్షితులై, కులమతాలకు అతీతంగా నడుస్తున్న జనసేన పార్టీకి అండగా ఉంటామని అన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు, ఎల్ నాగూర్, పి.సుబ్బారావు, కే విజయ్ కుమార్, సిహెచ్ నాగేశ్వరరావు, డి రాజ్ కుమార్, వి వినోద్ కుమార్, ఎం మహేశ్వర రావు, యన్ సుదర్శన్, డి రాజు తో పాటు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన బండారు శ్రీనివాస్ కు, గారపాటి త్రిమూర్తులు, ధనరాజ్ నాయుడు, నరాలు నారాయుడు, వనం సూరిబాబు, బైరిశెట్టి రాంబాబుకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అభిమానులకు, కొత్తగా ఎన్నికైన గ్రామ కమిటీ సభ్యులు, ఈరోజు జరిగిన జనసేన పార్టీ సమావేశంలో కృతజ్ఞతలు తెలిపినారు. 

See also  ఉరదాళ్ళపాలెం గ్రామంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం