
కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయాలి – పోలిశెట్టి చంద్రశేఖర్
కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదని వైసీపీ ప్రభుత్వం మరొకసారి ఇస్తారా? ఇవ్వరా? ఖచ్చితమైనప్రకటన చేయాలి. ద్వంద్వ వైఖరి వైసీపీ ప్రభుత్వానికి మంచి పద్దతి కాదని రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాపు కార్పొరేషన్ కి ఖర్చు పెట్టే నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. కాపులు ఎప్పటినుంచో కోరుతున్న రిజర్వేషన్లు కూడా అమలు చేయాలి. కార్పొరేషన్ ఫండ్స్ అనేవి నిర్దేశిత గ్రూపులకు మాత్రమే ఇవ్వాలి. వైసీపీ ప్రభుత్వం వాళ్ల పథకాలకు ఫండ్స్ ని డైవర్ట్ చేసి వాళ్ల నవరత్నాల్లో కలిపి వేయడం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కాపు కార్పొరేషన్ పై శ్వేత పత్రం విడుదల చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది అయినా సరే ఈ ప్రభుత్వం మొండి వైఖరితో స్పష్టత ఇవ్వడం లేదు.. ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి గారు కాపులకు రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పి మొహమాటం లేకుండా చెప్పడం జరిగింది ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది ప్రజలకు ముంచిచేస్తారేమోనని. కాని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తి కాకుండానే ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసారు. అంతేకాకుండా మరొకసారి కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదు అని చెబితే అందరికీ స్పష్టత వస్తుంది.. వైసీపీ ప్రభుత్వం గాని ప్రజాప్రతినిధులు గాని ఎన్నికల్లో మేము ఇవ్వం. అని చెప్పాం కాబట్టి ఇప్పుడు ఇవ్వం. ఇస్తారా? ఇవ్వరా? ఖచ్చితమైన వివరణ ఇవ్వాలని ఇలాంటి ద్వంద్వ వైఖరి వైసిపి ప్రభుత్వానికి మంచి పద్దతి కాదు? పూర్తి వివరాలతో స్పష్టత ఇవ్వాలి? అలాగే కాపు కార్పొరేషన్ ఇతర కార్పొరేషన్ ల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు మీడియా పూర్వకంగా తెలియజేయడం జరిగింది. కరోనాపై ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తీవ్రతను చెబితే ఏపీ ప్రభుత్వం ఇది ఒక మామూలు ప్లూ జ్వరం లాంటిది అని తేలికగా తీసుకోవడం.. ఈ వైసీపీ ప్రభుత్వం కరోనా వచ్చిన పేషెంట్లపై నిర్లక్ష్యం వహించడం వారికి వైద్య సదుపాయాలు కల్పించకపోవడం వలన చాలా మంది మరణించడం జరుగుతుంది. కనీసం ఆహార సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది. రామచంద్రపురం నియోజకవర్గం లో వైసీపీ కార్యకర్తలు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తిరిగి వస్తున్న సందర్భంలో రోడ్ల మీద ఫ్లెక్సీలు కడుతూ సామాజిక దూరం పాటించకపోవడం వల్ల రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రతీచోటా కరోనా కేసులు విపరీతంగా పెరిగుతాయని ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా 80 వేలకు పైగా కరోనా కేసులు పెరగడం చాలా బాధాకరం అని రోజురోజుకు కరోనా కేసులు తీవ్రంగా పెరగడానికి గల కారణం బ్రాందీ షాపులు మరియు రేషన్ షాపుల వద్ద సామాజిక దూరం పాటించకపోవడం. ముఖ్యకారణం ఇప్పుడు ఉన్న పరిస్థితి లో రాష్ట్రానికి ఆదాయం గురించి ఆలోచించకుండా బ్రాందీ షాపులు కరోనా తగ్గుముఖం పట్టేవరకు నిలుపుదల చేయాలి ప్రజలు ఇబ్బందికి గురయ్యే రేషన్ ని వాలంటీర్లు ఇంటికి తీసికొని వెళ్ళే మార్గం తక్షణమే అమలు చేయాలని, రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సింది గా మీడియా పూర్వకంగా తెలియజేయడం జరిగింది..









