మైఫోర్స్ మహేష్ ఆధ్వర్యంలో 85వ రోజుకి చేరుకున్న జనం కోసమే జనసేన పాదయాత్ర

మైఫోర్స్ మహేష్

        మదనపల్లి ( జనస్వరం ) : మై ఫోర్స్ మహేష్ గారు గత 85 రోజులుగా బికేపల్లి నందు ఇంటి ఇంటికి పాదయాత్రగా వెళ్లి వాళ్ళ సమస్యలు వాళ్ల బాగోగులు తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్ర కాలనీలో 85వ రోజు జనం కోసమే జనసేన పాదయాత్ర కొనసాగించారు. ఓ అంగవికలుడు ఈ వైయస్సార్ ప్రభుత్వంలో ఎన్నిసార్లు గ్రామ వాలంటీర్లు,గ్రామ సచివాలయాలు చుట్టూ తిరిగిన తమకు “వైయస్సార్ పెన్షన్” గాని,  “వైయస్సార్ ఇల్లు” గాని కేటాయించలేదని వాపోయాడు. తనకు బాసటగా నిలిచి ఇల్లు పెన్షన్ వచ్చేవరకు జనసేన తరఫున పోరాటం చేస్తామని తెలియచేస్తున్నానని మై ఫోర్స్ మహేష్ తెలిపారు. 

See also  ఆపదలో ఉండే వారికి అండగా ఉండే పార్టీ జనసేన