స్థానిక సమస్యలపై చర్చించిన మదనపల్లి జనసేన నాయకులు, వీరమహిళలు

జనసేన

       మదనపల్లి ( జనస్వరం ) : జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరి ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరుజిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, వారి సతీమణి నలిని, మదనపల్లె జనసేనాని టీం అధ్యక్షులు గోపాల కృష్ణ, జనసేన మదనపల్లె మండల కమిటి ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, గుణ తదితరులు కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వారితో పలు అంశాలపై చర్చించడం జరిగింది. స్థానిక సమస్యలను వివరించి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరుపున చేయబోయే కార్యక్రమాల గురించి వివరించారు. 

See also  ఛలో నరసాపురం గోడపత్రికలను ఆవిష్కరించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ జనసేన నాయకులు