తిరుపతి రూరల్ మండలంలో కృష్ణయ్య ఆధ్వర్యంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

తిరుపతి రూరల్ మండలంలో కృష్ణయ్య ఆధ్వర్యంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

                    విజయదశమి సందర్భముగా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలంలో జనసైనికుల  ఆత్మీయ సమావేశం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తిరుపతి జనసేన నాయకులు సి. కృష్ణయ్య గారు పాల్గొన్నారు. జనసేన నాయకులు కృష్ణయ్య మాట్లాడుతూ మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. దేశానికి యువత ప్రధాన సంపద బలమైన ఆయుధం లాంటి వారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని అన్నారు.  నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 50 మంది జనసైనికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గిరిప్రసాద్, జనసైనికులు   తదితరులు పాల్గొన్నారు. 

See also  పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఆమదాలవలస జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి